: మూత్ర విసర్జనతో మొబైల్ చార్జింగ్


మొబైల్ ఫోన్లో చార్జింగ్ అయిపోయిందా? అర్జెంటుగా కాల్ లేదా ఎస్ఎంఎస్ చేయాల్సి ఉందా? కంగారు పడకండి. చార్జర్ లేకపోయినా, దగ్గర్లో పవర్ ప్లగ్ లేకపోయినా చింతించకుండా బాత్ రూమ్ కు వెళ్లొస్తే సరి. అదేంటీ అనుకుంటున్నారా..? బ్రిటన్ పరిశోధకులు మూత్ర విసర్జనతో మొబైల్ బ్యాటరీని చార్జ్ చేయవచ్చని కనిపెట్టేశారు. మూత్రం ద్వారా విద్యుదుత్పత్తి చేయవచ్చని కనిపెట్టడం ప్రపంచంలో ఇదే తొలిసారని, ఇది నిజంగా అద్భుతమని డాక్టర్ లోన్నిస్ లెరోపోలస్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ కు చెందిన ఈయన, మరికొందరు కలిసి ఈ పరిశోధన సాగించారు.

మూత్రాన్ని ధారాళంగా పోస్తున్న సమయంలో మొబైల్ బ్యాటరీని చార్జ్ చేయవచ్చని పరిశోధనలో గుర్తించినట్లు లోన్నిస్ చెప్పారు. అయితే, ఎక్కువ సమయం పాటు మాట్లాడుకోవడానికి వీలుగా బ్యాటరీని చార్జ్ చేసేందుకు అవసరమైన మైక్రోబయల్ ఫ్యుయల్ సెల్ విధానాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.

  • Loading...

More Telugu News