: నీళ్లు తాగండి.. హుషారుగా ఉండండి!


పని ఒత్తిడితో సతమతమైపోతున్నారా? చదివి చదివి అలసిపోయారా? అయితే 'శుభ్రంగా నీళ్లు తాగండి.. ఉత్సాహం దానంతటదే వస్తుంది' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. న్యూయార్క్ లో జరిపిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కువగా నీరు తాగని వారికంటే, ముప్పావు లీటరు నీరు తాగినవారు పరీక్షలను బ్రహ్మాండంగా రాశారని సదరు పరిశోధన తెలిపింది. 34 మంది విద్యార్థులపై జరిపిన పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను కనుగొన్నారు.

ఈ పరిశోధనలో భాగంగా కొందరు విద్యార్థులకు ఓ పరీక్ష పెట్టారు. కంప్యూటర్ స్క్రీన్ మీద వస్తువు కనిపించగానే వాళ్లు ఓ బటన్ నొక్కాలి. అయితే నీరు తాగినవారు చక్కగా స్పందించి చకచకా నొక్కగా, తాగనివారు ఆలస్యంగా స్పందించారట. ఇదీ ఆ పరిశోధనల ఫలితం. కనుక, 'ఎంచక్కా నీరు తాగండి, బుర్రపదును పెంచుకోండి' అని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. అంతకంటే ముందు పలు పరిశోధనలు నీరును మించిన దివ్యౌషధం లేదని రుజువు చేశాయి. అందుకే నీరు తాగండి హుషారుగా ఉండండి!

  • Loading...

More Telugu News