: అనిల్ అంబానీకి సమన్లపై విచారణ ఈనెల 19కి వాయిదా
2జీ స్పెక్ట్రం కేసులో సాక్ష్యం ఇచ్చేందుకు రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీలకు సమన్లు జారీ చేయడంపై నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. జులై 19న దీనిపై విచారణ చేపట్టనుంది. వీరిద్దరూ సాక్ష్యం ఇచ్చేందుకు సమన్లు జారీ చేయాలని కొన్నిరోజుల కిందట సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో అడాగ్ ప్రమేయంపై కంపెనీ అధికారులను ప్రశ్నించామని, సరైన సమాధానాలు రాలేదని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. అందుకే అనిల్, టీనా అంబానీలను సాక్షులుగా విచారించాలని అనుకుంటున్నామని తెలిపింది.