: నీటమునిగిన నిజామాబాద్
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ పట్టణం నీటమునిగింది. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాదులో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పట్టణంలోని ఇస్లాంపురా, ఖోజా కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. నడుంలోతు నీళ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.