: సచిన్ బెస్ట్ బ్యాట్స్ మన్ కాదట!


ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రీకీ పాంటింగ్.. సచిన్ టెండూల్కర్ ఘనతలపై పెదవి విరుస్తున్నాడు. విండీస్ మాజీ కెప్టెన్ బ్రయాన్ లారా.. సచిన్ కంటే గ్రేట్ అంటూ కితాబిస్తున్నాడు. జట్టుకు విజయాలు అందించడంలో సచిన్ కంటే లారానే ముందున్నాడని చెప్పాడు. "సచిన్, లారా ఇద్దరూ గొప్ప ఆటగాళ్లే. కానీ, నాకు తెలిసినంత వరకూ సచిన్ కంటే లారానే తన జట్టుకు ఎక్కువ విజయాలు అందించాడు. ఆటలో సచిన్ ను నిలువరించే మార్గాన్ని ఎలా అయినా పట్టుకోవచ్చు. కానీ, లారా మాత్రం ఆటను తన వైపునకు తిప్పుకుంటాడు. నా వరకు సెంచరీలు ముఖ్యం కాదు. ఎన్ని మ్యాచ్ లు, సిరీస్ లు గెలిచామన్నదే ముఖ్యం" అని పాంటింగ్ సెలవిచ్చాడు.

  • Loading...

More Telugu News