: పిల్లల్ని 'ఫేస్ బుక్' కి దూరంగా ఉంచండి: ఢిల్లీ హై కోర్టు
13 ఏళ్ల లోపు బాలలను 'ఫేస్ బుక్'కి దూరంగా ఉంచాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సామాజిక అనుసంధాన నెట్ వర్క్ ఫేస్ బుక్ లో 13 ఏళ్ల లోపు పిల్లలు ఖాతా తెరిచేందుకు వీలు లేదంటూ ప్రకటన జారీ చేయాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.డి. ఆహ్మద్, జస్టిస్ విభు బఖ్రులతో కూడిన ధర్మాసనం ఆ సామాజిక నెట్ వర్కింగ్ సైట్ ను ఆదేశించింది. 'ఫేస్ బుక్' హోం పేజీలో కోర్టు ఆదేశానుసారం ప్రకటనను అప్ లోడ్ చేసి, 13 ఏళ్ళ లోపు బాలల ప్రవేశాన్ని నిరోధించే ఏర్పాటు చేయనున్నట్టు 'ఫేస్ బుక్' తరపు న్యాయవాది త్రిపాఠీ తెలిపారు.