: హరీశ్ రావు సొంత నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు చిక్కులు


టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు సొంత నియోజకవర్గం సిద్ధిపేటలో ఆ పార్టీకి చిక్కులు వచ్చిపడ్డాయి. ఇక్కడ ఒక్కో గ్రామం నుంచి పంచాయతీ ఎన్నికలకు ముగ్గురు నుంచి నలుగురు టీఆర్ఎస్ అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. పార్టీకోసం తాము ఎంతో కొంత కష్టపడ్డామని, అందుకే నామినేషన్లు వేశామంటున్నారు. ఈ వింతఘటనకు ఆశ్చర్యపోతున్న గ్రామస్తులు ఎవరికి ఓటు వేయాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు.

ఒకే పార్టీ నుంచి ముగ్గురు నలుగురు బరిలోకి దిగడమేంటని అంటున్నారు. అయితే, తమకు నచ్చిన వారికే ఓటు వేస్తామని చెబుతున్నారు. ఇటు అభ్యర్ధులు మాత్రం గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంతో టీఆర్ఎస్ కు చిక్కులు వచ్చాయని అనుకోకతప్పదు. దీనివల్ల ఓట్లు చీలి మిగతా పార్టీలకు లబ్ది చేకూరినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!

  • Loading...

More Telugu News