: అమెరికాలో హత్యలు చేసి, ఇండియాలో పట్టుబడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్


భార్య, పిల్లలను అమెరికాలో దారుణంగా హ్యత చేసిన ఘటనలో టెక్కీ నెరుసు లక్ష్మీనారాయణ ఎట్టకేలకు చిక్కాడు. చాలాకాలంగా పరారీలో ఉన్న అతన్ని హైదరాబాదు నేర పరిశోధక విభాగం అధికారులు ప్రణాళిక ప్రకారం అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. హత్య అనంతరం అమెరికా నుంచి పారిపోయి, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చేరుకున్నాడు. అక్కడ లక్ష్మీ నారాయణపై వరకట్నం కేసు నమోదు కావడవంతో మళ్లీ అదృశ్యమయ్యాడు.

దీంతో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. సెల్ నంబరు, బ్యాంక్ లావాదేవీలు, ఏటిఎం కార్డు, ఇ మెయిల్స్ ను ట్రాక్ చేయడంతో పోలీసుల వలకు చిక్కాడు. నారాయణ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. హఠాత్తుగా ఉద్యోగం పోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. అది తట్టుకోలేకే 2008 అక్టోబర్ 13న యూఎస్ లోని మిచిగాన్ లో భార్య విజయలక్ష్మిని, కూతురు తేజస్వి, కుమారుడు శివను కిరాతకంగా హత్య చేశాడు.

  • Loading...

More Telugu News