: గుంటూరులో దోపిడీ దొంగ బీభత్సం... ఒకరు మృతి
గుంటూరులో ఓ దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. ఇక్కడి బృందావన్ గార్డెన్స్ లో ఓ ఇంటిలో ఉంటున్న తల్లి కమలమ్మ, ఆమె కూతురుపై ఓ వ్యక్తి దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలు కావడంతో తల్లి మరణించగా, కుమార్తెను ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల నుంచి రాజేష్ అనే వ్యక్తి ప్లంబర్ గా వారి ఇంటిలోనే మకాం పెట్టాడు. అతని పని పూర్తి కాకపోవడంతో గతరాత్రీ వారి ఇంటిలోనే ఉన్నాడు. కానీ, అర్ధరాత్రి హఠాత్తుగా బంగారం కోసం తల్లి, కూతురుపై దారుణానికి తెగబడ్డాడని తెలుస్తోంది. ఆ వెంటనే అతను పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలిస్తున్నారు.