: విండీస్ చేతిలో పాక్ చావు దెబ్బ
వెస్టిండీస్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. నిన్న గయానాలో జరిగిన వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 232 పరుగులు చేసింది. డారెన్ బ్రావో(54), డ్వేన్ బ్రావో(43) పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 47.5 ఓవర్లకే అన్ని వికెట్లనూ కోల్పోయి 195 పరుగులు చేసింది. దీంతో 37 పరుగులతో విండీస్ విజయం ఖరారైంది. నాసిర్(54), ఉమర్ అక్మల్(50) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. నరీన్ నాలుగు వికెట్లు తీసుకుని విజయాన్ని విండీస్ సొంతం చేశాడు.