: బీహార్లో విషాదం.. 'మధ్యాహ్న భోజనం' తిని 11 మంది విద్యార్థుల మృతి


కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఆ చిన్నారుల పాలిట విషాదాంతమైంది. బీహార్లోని చాప్రా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని 11 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 100 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హుటాహుటీన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షించారు. మరణించిన చిన్నారుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. కాగా, ఫోరెన్సిక్ విభాగం ఆహారపదార్థాల శాంపిళ్ళను సేకరించింది. వాటిని పరీక్షించిన తర్వాత విద్యార్థుల మృతికి కారణాలు తెలుస్తాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News