: పటేల్ చదివిన స్కూల్ ను పట్టించుకోకుండా.. విగ్రహానికి విరాళమడిగిన మోడీ


సర్ధార్ వల్లభాయి పటేల్ విగ్రహానికి 2 వేల కోట్ల రూపాయల విరాళమడిగిన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.. వల్లభాయి పటేల్ చదివిన స్కూలును నిర్లక్ష్యం చేశారని పటేల్ ట్రస్టు సభ్యులు మండిపడుతున్నారు. 'ఉక్కు మనిషి వల్లభాయి పటేల్ చదివిన స్కూలు చెత్తకుప్పలా తయారవుతోంది.. విద్యనభ్యసించడం దుర్భరంగా మారింది. 25 లక్షల రూపాయల ప్రభుత్వ సహాయాన్ని అందజేయండి' అంటూ ఆనంద్ బెన్ పటేల్ 2001 లో రాసిన ఉత్తరాన్ని బుట్టదాఖలు చేసింది విద్యాశాఖ.

మరోసారి విజ్ఞాపన పెడితే, 2006లో, అలాంటి గ్రాంటేదీ లేదని సమాచారమిచ్చారు. అలాంటి నరేంద్రమోడీ సర్కారు తాజాగా ప్రపంచంలోనే అతి భారీస్థాయిలో సర్ధార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని నిర్మించేందుకు దేశవ్యాప్తంగా ఇనుపతుక్కును విరాళంగా అడిగింది. 2 వేల కోట్లతో విగ్రహాన్ని నిర్మిస్తామని మోడీ తెలిపారు. శిధిలమైపోతున్న విద్యాలయాన్ని బాగుచెయ్యండి మహాప్రభో.. వందలాది మంది పటేల్ లను తయారు చేస్తామంటూ పటేల్ ట్రస్టు కోరుతుండగా, ఆదుకోని మోడీ ప్రభుత్వం, అతని విగ్రహాన్ని తయారు చేసేందుకు ఉత్సాహం చూపడం విమర్శలకు తావిస్తోంది.

  • Loading...

More Telugu News