: భార్యను హత్య చేసిన దూరదర్శన్ స్ట్రింగర్


కర్ణాటకలోని కోదిగల్ వద్ద దూరదర్శన్ స్ట్రింగర్ గా పనిచేస్తున్న గంగాధర్ పదుబిద్రీ(44) తన భార్య మమతా శెట్టి (33)ని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు గంగాధర్ ను అరెస్టు చేశారు. గంగాధర్ అన్నయ్య మోహన్ అనగయ్య స్వామి ఫిర్యాదు మేరకు ఉర్వ పోలీసులు విచారణ చేపట్టడంతో హత్య విషయం బయటకు వచ్చింది. దాంతో, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమవారం నాలుగు గంటలకు మోహన్ తన సోదరుడు గంగాధర్ ఇంటికి వెళ్లినప్పుడు మమత శవాన్ని హాల్లో చూసినట్లు తెలిపారు. వెంటనే అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు గంగాధర్ ను అదుపులోకి తీసుకున్నారు. భార్యభర్తలు ఇద్దరూ తరచూ ఘర్షణ పడుతుండేవారని, భర్త గంగాధర్ మరో మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానం రావడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందని చెప్పారు.

రెండు రోజుల తర్వాత ఆ గొడవ పోలీసులు వద్దకు వెళ్లడంతో కౌన్సెలింగ్ ఇచ్చారని, అప్పుడు ఒద్దికగానే ఉంటామని చెప్పినట్లు తెలిపారు. కాగా, దీనిపై గంగాధర్ మరో సోదరుడు మాట్లాడుతూ...ఈ ఘటన తమ కుటుంబాన్ని బాగా షాక్ కు గురి చేసిందన్నారు.

  • Loading...

More Telugu News