: ఇందిర బాటలో నడిచే సోనియా రాష్ట్రాన్ని విడగొట్టరు: మల్లాది విష్ణు


ఇందిరా గాంధీ అడుగుజాడల్లో నడిచే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజిస్తారని తాను భావించడంలేదని విజయవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు తాము ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రం విభజించాల్సి వస్తే అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనకు తెలంగాణ ప్రాంతీయులు ఎలాంటి బౌలర్ ను రంగంలోకి దించినా, తమ దగ్గర సమర్ధవంతమైన బ్యాట్స్ మన్ ఉన్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News