: తనిఖీల్లో దొరికిన 39 లక్షలు.. 166 మందు బాటిళ్లు
పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న లక్షలాది రూపాయలు పట్టుబడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లాలో అక్కంపల్లికి చెందిన వెంకటశివారెడ్డి నుంచి రూ.2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద ఓ వ్యక్తి నుంచి రూ.13.38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదే జిల్లాలో ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలో ఓ వ్యక్తి నుంచి 6 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అంపురం వద్ద ఓ వ్యక్తి నుంచి 4 లక్షల రూపాయలు, 166 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు ఉప్పుటేరు వద్ద ఓ చేపల వ్యాపారి నుంచి 13.50 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.