: 30వ పడిలో కత్రినా


సల్మాన్, రణబీర్ సహా కోట్లాది మనసులను కొల్లగొట్టిన స్టార్ కథానాయిక కత్రినా కైఫ్ నేటితో 29 వసంతాల వయసు పూర్తి చేసుకుని 30వ పడిలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో తిరుగులేని కథానాయికగా కొనసాగుతున్న ఈ 'రొమాంటిక్ నైఫ్' మల్లీశ్వరి చిత్రంతో తెలుగు వారినీ మురిపించింది.

కత్రినా తల్లి బ్రిటీష్ వనిత కాగా తండ్రి కాశ్మీరీ. కత్రినా 1983, జూలై 16న హాంకాంగ్ లో జన్మించింది. భారత్ కు వచ్చిన తర్వాత కత్రినా తన ఇంటి పేరును టర్కొట్టే నుంచి కైఫ్ గా మార్చుకుంది. కైఫ్ అనేది తండ్రి ఇంటి పేరు. పార్టనర్, రేస్, సింగ్ ఈజ్ కింగ్, రాజ్ నీతి, జిందగీ న మిలేగీ దొబారా, ఏక్తా టైగర్, ధూమ్ 3 చిత్రాలు కత్రినా కెరీర్లో మరుపురాని విజయాలుగా నిలిచిపోతాయి.

తొలుత సల్మాన్ తో ప్రేమాయణం సాగించి అది కాస్తా తెగిపోయిన తర్వాత కత్రినా.. ప్రస్తుతం రణబీర్ కపూర్ తో డేటింగ్ కొనసాగిస్తోందని టాక్. ఇందుకు తాజా విదేశీ యాత్రే నిదర్శనం. ఇదైనా ఆమెను పెళ్లి పీటలు ఎక్కిస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News