: పార్లమెంటు బడ్జెట్ లాగే శాసనసభ బడ్జెట్: ఆనం
రాష్ట్ర అసెంబ్లీలో కూడా పార్లమెంటు తరహా బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నట్లు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు, పద్దులకు సంబంధించిన చర్చలు పూర్తి స్థాయిలో జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. కేరళలో అమలవుతున్న కేంద్ర బడ్జెట్ తరహా విధానాన్ని ఇక్కడ కూడా రూపొందించామని.. ఇందుకోసం పది సభా సంఘాలను ఏర్పాటు చేశామనీ ఆయన తెలిపారు.