: సీడబ్ల్యూసీ నిర్ణయం సమైక్యాంధ్రకే అనుకూలం: మంత్రి గంటా


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మొగ్గుచూపవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఎన్నికల కోసం రాజకీయాలు చేసే అవసరం కాంగ్రెస్ కు లేదని విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తే, మిగతా వెనుకబడిన ప్రాంతాలకూ ప్యాకేజి డిమాండు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News