: 'టీవీ9' గ్రూప్ లో వాటాలు చేజిక్కించుకోనున్న సన్ టీవీ!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ వార్తా చానల్ టీవీ9 నెట్ వర్క్ లో వాటాలు కొనేందుకు 'సన్ టీవీ' సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.150 కోట్ల విలువైన వాటాలను చేజిక్కించుకునేందుకు 'సన్ టీవీ' పావులు కదుపుతున్నట్టు సమాచారం. ఈ వార్తా కథనాన్ని 'బిజినెస్ లైన్' పత్రిక ఈరోజు ప్రచురించింది. మారిషస్ కేంద్రంగా ఉన్న సైఫ్ పార్టనర్స్ అనే ప్రయివేటు ఈక్విటీ సంస్థకు టీవీ9 నెట్ వర్క్ లో గణనీయమైన వాటా ఉంది. తన వాటాలను అమ్మి వేయాలని సైఫ్ పార్టనర్స్ భావిస్తోందట. ఈ వ్యవహారం 'సన్ టీవీ' వరకు వెళ్లడంతో తాజా కొనుగోలు ప్రక్రియ తెరపైకి వచ్చింది.