: వీడియో గేమింగ్ లో చైనా హవా
చైనాలో వీడియో గేమ్ విప్లవం నడుస్తోంది. వీడియో గేమింగ్ రంగంలో భవిష్యత్తులో వందల కోట్ల రూపాయల లాభాలార్జించే మార్కెట్ వాటాను సాధించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2011లో 3,500 కోట్ల రూపాయల లాభాలార్జించిన చైనా వీడియో గేమింగ్ రంగం, రానున్న రోజుల్లో మరిన్ని లాభాలు ఆర్జించనుందని ఆ దేశ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రంగంలో 17 స్థానంలో ఉన్న చైనా రానున్న రెండేళ్లలో మొదటి స్థానానికి చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏ దేశంలోనైనా వీడియో గేమింగ్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఎక్కువ మంది 'ఆపిల్' పై ఆధారపడుతున్నారు. అదే చైనాలో అయితే వీడియో గేమింగ్ కోసం వందలాది సైట్లు అందుబాటులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో రానున్న రెండు లేక మూడేళ్లలో వీడియోగేమ్ రంగంలో చైనా ప్రపంచ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందంటున్నారు.