: స్పెయిన్ 'బుల్ రన్' లో అపశృతి.. ఆస్ట్రేలియా మహిళ మృతి
స్పెయిన్ లో జరిగిన 'బుల్ రన్'లో అపశృతి చోటు చేసుకుంది. స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో జరిగిన ఈ 'బుల్ రన్'ను వీక్షిస్తుండగా ఓ ఆస్ట్రేలియన్ మహిళ మరణించింది. ప్రతి ఏటా జూలైలో జరిగే ఈ పోటీల్లో వేలాది మంది పాల్గొంటారు. ఈ ఏడాది జరిగిన పోటీల్లో దున్నపోతులతో సమానంగా పరుగెడుతూ వాటి బారినపడి నలుగురు గాయపడగా, వీటి దాడిలో ఆస్ట్రేలియన్ మహిళకూ తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఆమె మృతి చెందింది. మన రాష్ట్రంలో, తమిళనాడులో జరిగే జల్లికట్టు లాంటి ఈ బుల్ ఫైట్ లో ఏటా పదుల సంఖ్యలో గాయపడుతుంటారు. కొన్ని దేశాల్లో ఈ ప్రమాదకర ఆటను నిషేధించారు. అయినప్పటికీ ప్రతి ఏటా స్పెయిన్ లో ఈ ఆటను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు.