: తాజ్ మహల్ కట్టడానికి ముప్పు
తాజ్ మహల్ చుట్టూ రోడ్లు వేసుకుంటూ పోవడం ఇప్పుడు ఆ చారిత్రక కట్టడానికి కష్టాలు తెచ్చిపెడుతోంది. తాజ్ మహల్ ప్రాంగణం కంటే చుట్టూ ఉన్న రోడ్ల ఎత్తే మీటరు వరకూ పెరిగిపోయింది. వర్షం పడినప్పుడల్లా ఆ వరద నీరు తాజ్ మహల్ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండడంతో ఈ అపురూప కట్టడం భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతోంది. దీనిపై భారత పురావస్తు శాఖ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. రోడ్లు ఎత్తుగా ఉండడం వల్ల వరదనీరు నిలిచి, సందర్శకులకు ఇబ్బందికరంగా మారడమే కాకుండా, తాజ్ మహల్ ప్రాంగణం పునాదులకు నష్టం కలుగుతోందని పురావస్తు శాఖ నివేదించింది. ఈ నేపథ్యంలో రోడ్ల ఎత్తును తగ్గించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.