: కర్ణాటక నుంచి 'పోస్కో' అవుట్
దక్షణ కొరియాకు చెందిన 'పోస్కో' కంపెనీ కర్ణాటక రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. సుమారు 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో గదగ్ జిల్లాలో స్టీల్ మిల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి గత బీజేపీ ప్రభుత్వంతో 'పోస్కో' అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, భూసేకరణను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకుంటున్నట్టు 'పోస్కో' ఈ రోజు ప్రకటించింది. 2014 లోక్ సభ ఎన్నికల దృష్ట్యా సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు సహాయనిరాకరణ కూడా 'పోస్కో' వెనుకంజకు ఒక కారణం. ఒడిశాలోనూ భారీ స్టీల్ ప్రాజెక్టును చేపట్టిన 'పోస్కో' అక్కడా భూసేకరణ విషయంలో తీవ్ర వ్యతిరేకత చవి చూసింది. తాజా నిర్ణయం వెనుక ఆ అనుభవం కూడా ప్రభావం చూపినట్టు అర్థమవుతోంది.