: కాంగ్రెస్ నేత పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ అభ్యర్ధనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తనపై విచారణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రోజుల కిందట ఆయన పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన కోర్టు పిటిషన్ ను కొట్టి వేసింది. ఈ కేసులో ఆయనపై విచారణ కొనసాగుతుందని జస్టిస్ సురేష్ కైత్ తెలిపారు. అటు సజ్జన్ కు రెండు నెలలకిందట, ఈ కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించడాన్ని ఛాలెంజ్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్ పై ఆగస్టు 27 లోగా సమాధానం ఇవ్వాలని.. సజ్జన్ కు, సీబీఐకి ధర్మాసనం గతవారమే నోటీసులు జారీ చేసింది. ఇందిరాగాంధీ మరణానంతరం చెలరేగిన సిక్కు అల్లర్లలో సుల్తాన్ పురి వద్ద ఆరుగురిని ఊచకోత కోశారంటూ సజ్జన్ తోపాటు మరో నలుగురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.