: విరాళాలకోసం వెళితే విషాదం మిగిలింది
విరాళాల కోసం సాహసానికి పూనుకుంటే చివరికి ప్రాణాంతకంగా ఆ సాహసం పరిణమించింది. ఇంగ్లిష్ ఛానల్ ఈది దాని ద్వారా విరాళాలు సేకరించాలనుకున్న ఒక మహిళ తన కార్యక్రమం పూర్తికాకుండానే మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది.
డయాబెటిస్ యూకే, రెయిన్‌బోస్ చిల్డ్రన్స్ హాస్పైస్ కోసం విరాళాలు సేకరించాలని 34 ఏళ్ల సుసాన్ టేలర్ ఇంగ్లిష్ ఛానల్ ఈదాలని నిర్ణయించింది. ఆదివారం నాడు ఇంగ్లిష్ ఛానల్ ఈదుతుండగా అకస్మాత్తుగా సుసాన్ అశక్తురాలైంది. ఈ విషయం తెలిసిన పరిశీలకులు వెంటనే ఆమెను పడవలోకి చేర్చి చికిత్స అందించారని, ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయిందని సుసానన సోదరి తన ఫేస్‌బుక్ పేజిలో తెలిపింది. విరాళాల కోసం ఇంగ్లిష్ ఛానల్ ఈదుతోందని తెలిసిన తర్వాత కన్నా ఆమె మరణించిందన్న వార్త తెలియగానే సుసాన్ ఛారిటీ పేజిపై రెట్టింపు ప్రతిస్పందన వచ్చిందట. ఇప్పటి వరకూ ఇంగ్లిష్ ఛానల్ ఈదే క్రమంలో 1875 నుండి ఏడుగురు మరణించారు.