: బీజేపీ... ట్విట్టర్ అకౌంట్లతోనూ, అబద్ధాలతోనూ నడుస్తోంది: కాంగ్రెస్


బీజేపీ.. ట్విట్టర్ అకౌంట్లతోనూ, అబద్ధాలతోనూ నడుస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అఫ్జల్ పేర్కొన్నారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ బీజేపీ అయోమయంలో ఉందని, ఆ పార్టీ తన అజెండా ఏమిటో ఎప్పుడో మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు కాసేపు లౌకికవాదం గురించి, మరికాసేపు కమ్యూనలిజం గురించి మాట్లాడుతారని విమర్శించారు. కేవలం అబద్ధాలు ట్విట్టర్లో ప్రచారం చేస్తూ పార్టీని నడుపుతున్నారని అఫ్జల్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News