: నాకు విద్యా బాలన్, కరీనా కపూర్ ఇష్టం: వహీదా రెహమాన్
నిన్నటి తరం ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్, తనకు ప్రస్తుతం ఉన్న నటీమణుల్లో కరీనా కపూర్, విద్యాబాలన్ నటన అమితంగా నచ్చుతుందని అన్నారు. ముంబైలో ఇండో-సౌతాఫ్రికా ఫిల్మ్, టీవీ అవార్డుల ఫంక్షన్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ, తాజాగా రంగప్రవేశం చేస్తున్న వర్ధమాన తారల్లో నైపుణ్యం బాగా ఉంటోందని అభిప్రాయపడ్డారు. విద్యా, కరీనా, హుమా ఖురేషీ, కంగనా రనౌత్ వంటి వారు తమదైన శైలి నటనతో అందర్నీ అలరిస్తూ, అద్భుతంగా రాణించగలుగుతున్నారని వహీదా అన్నారు.