: 12వేల సర్పంచ్ నామినేషన్లు తిరస్కరించిన ఈసీ


పంచాయతీ ఎన్నికల సందర్భంగా 12,071 సర్పంచ్ నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. నిబంధనలకు అనుగుణంగాలేని 23,238 వార్డు సభ్యుల నామినేషన్లను కూడా తిరస్కరించామని చెప్పారు. హైదరాబాద్ లో నేడు మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్ చేసుకుంటే రేపు సాయంత్రం లోగా ఆర్డీవోలు పరిష్కరిస్తారన్నారు. ఆర్డీవోల విచారణలో కూడా తిరస్కరణకు గురైతే ఎన్నికల తర్వాత ఎన్నికల ట్రైబ్యునల్ వద్దకు వెళ్ళవచ్చని మిట్టల్ పేర్కొన్నారు. ఈనెల 23,27,31 తేదీల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News