: వయస్సును దాచేది జుట్టే
జుట్టు వయస్సును దాచేస్తుందట! వయసు ప్రభావం జుట్టుతోనే ముడిపడి ఉంటుందని ఒగారియో లండన్ సెలూన్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్ నోరిస్ ఒగారియో చెబుతున్నాడు. లండన్ లో జుట్టు గురించి మాట్లాడుతూ జీవితంలో ప్రతిదశలోనూ వయసును దాచి ఉంచడంలో జుట్టుదే కీలకపాత్ర అని చెబుతున్నాడు. జుట్టును బట్టే వ్యక్తి లక్షణాలు అంచనావేయొచ్చని అంటున్నాడు. 30 ఏళ్లు దాటిన వాళ్లలో ఆడాళ్లు, మగాళ్లు కుటుంబ బాధ్యతల్లో తలమునకలై తమ గురించి తాము పట్టించుకోరని ఆ దశలో జుట్టూడి, పల్చబడి వయస్సు ఎక్కువగా కనిపిస్తుందని తెలిపాడు.
తినే తిండి, అనారోగ్యానికి చికిత్స, కాలుష్యం వంటివి కూడా జుట్టుపై మరింత ప్రభావం చూపుతాయని తెలిపాడు. 40 ఏళ్లు దాటితే వారికి జుట్టు తెల్లబడడం, ఊడిపోవడం మహిళలకు ప్రధాన సమస్యలని తెలిపాడు. దీనికి సరైన పోషకాహారం తీసుకోవడం, తలకు మంచి రంగులు వాడడం, ట్రిమ్మింగ్ చేయించుకోవడం సరైన ఉపాయమన్నాడు. సరైన స్టైల్ ఎంచుకుని దానికి తగ్గట్టు హెయిర్ కటింగ్ చేయించుకుంటే వయస్సు కనబడిపోతుందనే బెంగ ఉండదని ఒగారియో సలహా ఇస్తున్నాడు.