: ఇంటర్నెట్ తో జాగ్రత్త గురూ..


ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ తెలియని వారుండరు. ముఖ్యంగా చిన్నపిల్లలైతే వీడియోగేమ్ ఆడినంత తేలికగా దీన్ని ఉపయోగిస్తున్నారు. దాంతో, నెట్ లోకి హ్యాకర్లు చొరబడే అవకాశం ఉందంటున్నారు సైబర్ నిపుణులు. ఇలా నెట్ గురించి తెలియకుండా వాడేస్తున్న 13 నుంచి 18 మధ్య టీనేజ్ పిల్లలకు ఇంటర్ నెట్ భద్రతలో శిక్షణ ఇచ్చేందుకు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఏంఏఐ), ఫేస్ బుక్ ముందుకొచ్చాయి. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా విద్యార్ధులకు కొన్ని రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపాయి. బాలలతోపాటు టీచర్లు, తల్లిదండ్రులు ఈ శిక్షణలో పాల్గొనాల్సి ఉంటుంది.

ఈ శిక్షణలో ఇంటర్ నెట్ వల్ల పొందే ప్రయోజనాలతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉండటం ఎలా? వంటి విషయాలు నేర్పుతారు. ముందుగా ఢిల్లీ, ముంబై, హైదరాబాదు నగరాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 30 విద్యా సంస్థల్లోని 18వేల మందికి పలు విషయాలు బోధించనున్నారు. దీనికి సంబందించిన అన్ని ప్రాంతీయ భాషల్లోనూ శిక్షణ మెటీరియల్ ను ఫేస్ బుక్ తయారు చేయనుంది. కాగా, గడచిన నాలుగు సంవత్సరాల్లో 6 లక్షల 25వేల మందికి ఇటువంటి శిక్షణ ఇచ్చామని ఐఏఏంఏఐ అధ్యక్షుడు శుభోరాయ్ తెలిపారు. వచ్చే సంవత్సరంలో ఈ శిక్షణను ఇతర దేశాల నగరాలకు విస్తరించనున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News