: 'నిర్భయ'కు అవార్డు అంకితమిచ్చిన బాలీవుడ్ 'తార'


బాలీవుడ్ యువనటి రేఖ రానా తనకు లభించిన ఉత్తమ నటి అవార్డును, గత సంవత్సరం డిసెంబర్ లో ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై మరణించిన 'నిర్భయ'కు అంకితం చేసింది. తాను నటించిన చిత్రం కూడా.. ఒక మహిళ కఠినమైన పరిస్థితుల మధ్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనే అంశాన్ని ప్రతిఫలిస్తుందని తెలిపింది. బాలీవుడ్ లో కొన్నిరోజుల కిందట విడుదలైన 'తారా' చిత్రంలో రేఖ నటించింది. ఈ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సైతం ప్రశంసలు అందుకుంటోంది.

ఈ చిత్రంలో ఆమె నటనకుగాను జైపూర్ అండ్ నషిక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు దక్కింది. అంతేగాక ఈ చిత్రానికి దక్షిణాఫ్రికా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ కథ, స్ర్కీన్ ప్లే అవార్డులను ఆస్కార్ విన్నింగ్ నిర్మాత మార్క్ బాస్చెట్ చేతుల మీదుగా ఆమెకు బహూకరించారు.

  • Loading...

More Telugu News