: తండ్రి అంత్యక్రియలకు వెళ్లి వస్తూ.. తను కూడా..
తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి శ్మశానం నుంచి వస్తూ అతని కుమారుడు హఠాన్మరణం పాలయ్యాడు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతంపురం కాలనీకి చెందిన బర్ల జోగయ్య(72) ఆదివారం మరణించగా, ఆయన అంత్యక్రియలు ముగించిన అనంతరం, అతని పెద్ద కుమారుడు బర్ల పుల్లయ్య(42) తిరిగి వస్తూ హఠాత్తుగా క్రింద పడిపోయాడు. అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు. దీంతో దిగ్భ్రాంతికి లోనైన అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.