: తానే 108 పిలిచినా చావు తప్పలేదు


తనంత తానుగా 108 కి ఫోన్ చేసి రప్పించుకున్నా తన మృత్యువునాపలేకపోయాడా పెద్దమనిషి. వివరాల్లోకెళితే తమిళనాడు ధర్మపురి జిల్లాలో సబ్ జడ్జిగా పనిచేస్తున్న దురైస్వామి వారాంత సెలవుకు స్వగ్రామం వెళ్లారు. విధులకు హాజరయ్యేందుకు తిరుగు ప్రయాణం కోసం ధర్మపురి బస్సెక్కారు. కాసేపట్లోనే గుండెలో నొప్పిగా ఉంది అని బస్సును ఆపి 108 ను పిలిచారు. మరింత ఇబ్బందిగా ఉందని, అర్జెంటుగా ఆసుపత్రిలో చేర్చాలి రావాలని కోరారు. వారు ఆసుపత్రికి చేర్చేలోపే దురైస్వామి కన్నుమూశారు.

  • Loading...

More Telugu News