: అమెరికాలో తెలుగు ఫాదర్ కాముకత


అతడి పేరు కొప్పుల లియో. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు డయాసిస్ కు అతగాడు ఫాదర్ గా వ్యవహరిస్తుండేవాడు. గత నాలుగేళ్ళుగా అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని బ్లూ ఎర్త్ ప్రాంతంలో సెయింట్ పీటర్స్ చర్చిలో ఫాదర్ గా విధులు నిర్వరిస్తున్నాడు. లియో అలాగే కంటిన్యూ అయి ఉంటే తిప్పలు తప్పేవి. కానీ, అతడి కళ్ళను కామపు పొర కమ్మేసింది. బ్లూఎర్త్ లో ఓ వృద్ధురాలు, చిన్నారి బాలికతో కలిసి ఉంటోంది. ఓ రోజు తన ఇంటి్కి ఫాదర్ లియోను ఆహ్వానించింది. భోజనం పెట్టిన అనంతరం ఆ మహిళ పనిమీద బయటికెళుతూ, చిన్నారిని లియోకు అప్పగించింది.

కానీ, ఈ ప్రబుద్ధుడు ఆ బాలికపై తన కామప్రకోపాన్ని ప్రదర్శించాలనుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఆ నీచుడి ఉద్ధేశాన్ని పసిగట్టిన బాలిక భయపడి ఆ వృద్ధ మహిళకు సమాచారమందించింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లియోకు అరదండాలు పడ్డాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి 25 ఏళ్ళకు తగ్గకుండా జైలుశిక్ష పడుతుందని చెప్పారు.

  • Loading...

More Telugu News