: క్రికెట్ ప్రేక్షకుడిపై ఐదేళ్ళ బ్యాన్


శ్రీలంక పేసర్ లసిత్ మలింగపై బాటిల్ విసిరినందుకు విజయ్ ఆతిమ్ అనే ప్రేక్షకుడిని ఐదేళ్ళపాటు నిషేధించింది కరీబియన్ క్రికెట్ బోర్డు. భారత్, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. మలింగ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఆతిమ్ సగం నీటితో ఉన్న బాటిల్ ను విసిరాడు. ఈ ఘటనపై శ్రీలంక యాజమాన్యం రిఫరీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రినిడాడ్ అండ్ టొబాగో క్రికెట్ బోర్డు సదరు ప్రేక్షకుడిని ఐదేళ్ళపాటు దేశవాళీ, అంతర్జాతీయ పోటీలు వీక్షించకుండా నిషేధం విధించింది. ఇలాంటి దుందుడుకు చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News