: వరుణ్ సందేశ్ పై మోహన్ బాబు ఫైర్!
యువ హీరో వరుణ్ సందేశ్ కు నటుడు మోహన్ బాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. మోహన్ బాబు తన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్ లతోపాటు వరుణ్ సందేశ్, తనీష్ లతో కలిసి ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగు ప్రస్తుతం బ్యాంకాక్ లో జరుగుతోంది. అయితే, అక్కడి థాయ్ యువతితో హీరో వరుణ్ సందేశ్ దురుసుగా ప్రవర్తించాడట. దాంతో, ఆ యువతి కొంతమంది మనుషులను పంపడంతో వాళ్లు వరుణ్ పై దాడి చేశారు. అదే సమయంలో అక్కడ మోహన్ బాబుపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ గొడవ ఆయనకు కోపం తెప్పించింది. అటు ఘర్షణ పోలీసుల వరకు వెళ్లడంతో, మంచు మనోజ్ ఈ విషయంలో అవతలివారికి వరుణ్ తో రాజీ కుదిర్చి పంపించి వేశాడు.
కానీ, ఈ వ్యవహారంతో మరింత కోపోద్రిక్తుడైన మోహన్ బాబు వరుణ్ ఫై ఫైరయ్యాడని తెలుస్తోంది. 'నీ పిచ్చి ప్రవర్తనతో బ్యాంకాక్ లో తెలుగోళ్ల పరువు తీశా'వంటూ మోహన్ బాబు గట్టిగా బుద్ది చెప్పాడని సమాచారం. ఇకముందు ఇటువంటి పనులు చేస్తే బాగోదన్నట్లు గట్టిగా చెప్పాడట. హిందీ హిట్ చిత్రం 'గోల్ మాల్ 3'కి రేమేక్ గా 'గలాటా' అనే టైటిల్ తో రూపొందుతోన్న సినిమాలోనే వీరందరూ నటిస్తున్నారు.