: జగన్ రిమాండ్ పొడిగింపు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా, ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితులకు హైదరాబాదు నాంపల్లి సీబీఐ కోర్టు ఈనెల 29 వరకు రిమాండును పొడిగించింది. జగన్, విజయసాయి, మోపిదేవిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. రిమాండు ముగియడంతో ఈ ఉదయం పోలీసులు.. జగన్, విజయసాయి, మోపిదేవి మినహా మిగతావారిని సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.