: తక్కువ ధరలో కొత్త కారు.. నిస్సాన్ హల్ చల్
కార్ల మార్కెట్లో మరోసారి హల్ చల్ చేసేందుకు నిస్సాన్ కంపెనీ సిద్దమవుతోంది. జపాన్ కు చెందిన ప్రముఖ కార్ల ఉత్పత్తి దారు నిస్సాన్ సంస్థ తమ 'డాట్సన్' బ్రాండ్ ని తిరిగి మార్కెట్ లోకి విడుదల చేసింది. 'డాట్సన్ గో' అనే ఈ కొత్త కారును 4 లక్షల రూపాయల కంటే తక్కువ ధరకే విక్రయిస్తామని సంస్థ ప్రకటించింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత మళ్లీ భారత మార్కెట్లో కనువిందు చేయనున్న ఈ కార్లు వచ్చే సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా సీఈవో కార్లోస్ ఘోస్న్ మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ లో 1.2 శాతంగా ఉన్న తమ మార్కెట్ షేర్ ను 10 కి తీసుకెళ్లడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు.