: సంజూ కోసం ప్రభుదేవా సినిమా
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కోసం దర్శకుడు ప్రభుదేవా ఓ చిత్రం రూపొందించేందుకు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం సంజూ యరవాడ జైలులో శిక్ష అనుభవిస్తుండటంతో ఆయనకు చెందిన ప్రొడక్షన్ సంస్థ వ్యవహారాలు భార్య మాన్యత పర్యవేక్షిస్తోంది. ఈ సంస్థ నిర్మాణంలో ఓ సినిమాను తెరకెక్కించాలని భావించిన మాన్యత.. ప్రభుదేవాను సంప్రదించింది. ఇందుకు అంగీకరించిన ప్రభుదేవా.. ఆ సినిమాకు గతవారమే సంతకం చేశాడని తెలుస్తోంది. ముంబయి పేలుళ్ల కేసులో సంజయ్ కు కొన్ని నెలల కిందట సుప్రీంకోర్టు ఐదేళ్ళ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే సంస్థ కోసం సెజల్ షా అనే దర్శకుడు 'హస్ ముఖ్ పిగల్ గయా' పేరుతో మరో చిత్రంను తెరకెక్కిస్తున్నాడు.