: విశాఖకు ఇక 24 గంటలూ విమానాలు
విశాఖపట్నం విమానాశ్రయం ఇకపై ఇరవై నాలుగు గంటలూ ప్రయాణీకులకు సేవలు అందించనుంది. మార్చి 1వ తేదీ నుంచి ఈ సౌకర్యం అమలులోకి రానుందని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు.
దీంతో విశాఖకు అంతర్జాతీయ విమానాల రాకపోకలు విస్తృతమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నౌకాదళం ఆధీనంలో ఉన్న విమానాశ్రయాన్ని 24 గంటలు తెరిచి ఉంచేలా రక్షణ శాఖ ఆదేశించేందుకు తాను కృషి చేశానని సుబ్బిరామిరెడ్డి వెల్లడించారు.