: సవాళ్లు, వివాదాల మధ్య ప్రారంభమైన కూడంకుళం అణు విద్యుదుత్పత్తి


ఎన్నో అడ్డంకులు, వివాదాలను దాటుకుని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఎట్టకేలకు ఉత్పత్తిని ప్రారంభించింది. అంతర్జాతీయ అణుశక్తి క్రమబద్దీకరణ బోర్డు ప్రతినిధుల సమక్షంలో ఈ ఉదయం విద్యుత్ ఉత్పత్తి ఆరంభ ప్రక్రియ 'క్రిటికాలిటీ' విజయవంతంగా పూర్తయింది. వెయ్యి మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి చేయనున్న ఈ కేంద్రం 10 వేల కోట్ల రూపాయలతో నిర్మితమైంది. తొలి దశలో 400 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్తత్తి చేయనుంది. అనంతరం దశల వారీగా వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుంటుంది. ప్రారంభ ప్రక్రియ విజయవంతం కావడంతో రియాక్టర్ సక్రమంగా విద్యుదుత్పత్తి చేస్తోందని సాంకేతిక బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విద్యుత్ ను దక్షిణాది గ్రిడ్ కు అనుసంధానిస్తామని అధికారులు తెలిపారు. దీంతో దక్షిణాది రాష్ట్రాల కరెంటు కష్టాలు తీరనున్నాయి.

  • Loading...

More Telugu News