: 'రిలయన్స్.. నిన్నొదలా' అంటున్న సీపీఐ నారాయణ
రిలయన్స్ సంస్థపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సమరశంఖం పూరించారు. కేజీ బేసిన్ లో రిలయన్స్ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. గ్యాస్ ఉత్పత్తి జరగడం లేదంటూనే, భారీ మొత్తంలో వెలికితీత కార్యక్రమాలు సాగిస్తోందని ధ్వజమెత్తారు. కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించిన నారాయణ.. రిలయన్స్ మోసాలకు యూపీఏ సర్కారు వంతపాడుతోందని విమర్శించారు. రిలయన్స్ పై తాము అలుపెరుగని పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. త్వరలోనే చమురు సంస్థల అక్రమాలపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపడతామని చెప్పారు.