: అవినీతిపై ప్రధానికి టెలిగ్రాముల వెల్లువ


సామాజిక సృహ మెండుగా ఉన్న కొందరు వ్యక్తులు టెలిగ్రామ్ సేవలకు చివరి రోజును చక్కగా వినియోగించుకున్నారు. 'అవినీతిని అంతం చేయండి, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్' అంటూ టెలిగ్రామ్ ద్వారా నినదించారు. ఢిల్లీలోని జన్ పథ్ లో ఉన్న సెంట్రల్ టెలిగ్రామ్ ఆఫీసు నుంచి ఒక యువకుడు ప్రధానికి అవినీతిపై టెలిగ్రామ్ పంపాడు. అక్కడున్న ఎంతోమందికి అతడి ఆలోచన నచ్చింది. వారు కూడా అతని బాటలోనే, అవినీతికి చరమగీతం పాడాలని కోరుతూ టెలిగ్రామ్ లు పంపారు.

కాజల్ అనే 20 ఏళ్ల యువతి యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవద్దని కోరింది. దీనివల్ల జనరిక్ మందులపై ప్రభావం పడుతుందని తెలిపింది. 1950లో 'హిందూ కోడ్ బిల్లు'ను నిరసిస్తూ జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ కు హిందూమహాసభ ఇలానే టెలిగ్రాములు పంపుతూ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రధానికి టెలిగ్రాములను నాటి హిందూమహాసభ సంఘటనతో పోలుస్తున్నారు విశ్లేషకులు.

  • Loading...

More Telugu News