: 15 ఏళ్లకే విద్యార్థులు తాగి ఊగుతున్నారు!


వారి వయసు 15 నుంచి 20లోపే ఉంటుంది. అందరూ ఇంటర్, డిగ్రీ స్టూడెంట్స్. వారంతా బుద్దిగా చదువుకోవడం లేదు.. అలాగని, ఆటల్లో మునిగిపోయి లేరు. ఎంచక్కా పబ్బుకు చేరి, పూటుగా మద్యం పట్టిస్తూ.. జాలీగా చిందులేస్తున్నారు. హుక్కా పొగను జుక్కు జుక్కుగా పీల్చేస్తున్నారు. ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పట్టణంలో ఉన్న డీటీ సిటీమాల్ పబ్ లోకి పోలీసులు అడుగుపెట్టినప్పుడు వారికి కనిపించిన దృశ్యమే ఇది. అక్కడ సుమారుగా 115 మంది విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థుల భవిష్యత్తు పాడయ్యేలా.. చిన్న వయసువారికి ఆల్కహల్ సరఫరా చేసినందుకు సదరు పబ్ యజమానిపై జరిమానా విధించామని, లైసెన్స్ కూడా రద్దు చేయడానికి ప్రయత్నిస్తామని పోలీసు అధికారి సుభాష్ కౌశిక్ తెలిపారు.

  • Loading...

More Telugu News