: ఆనాడు సునామీలో ప్రాణాలు కాపాడుకున్న అమ్మాయి.. నేడు దేశంలో టాప్ సైక్లిస్ట్


2004లో ఆసియా దేశాలను కుదిపేసిన సునామీ ముఖ్యంగా భారత దేశ తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో డెబోరా అనే అమ్మాయి కూడా అందర్లాగే ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న అడవుల్లోకి పరుగులు తీసింది.

అలా పరిగెత్తలేక జల ప్రళయం ధాటికి బలైన వారు కొందరైతే... బతుకు మీది తీపితో ప్రకృతిని సైతం వెక్కిరించి ప్రాణాలు నిలుపుకున్న కొందరిలో ఆమె కూడా ఉంది.

ఆ అమ్మాయి ఎంతో ఆస్తి నష్టం చవిచూసింది. అయినా ఆత్మవిశ్వాసం కో్ల్పోలేదు. తొమ్మిదేళ్లు గడిచిపోయాయి! ఇప్పుడా అమ్మాయి సైక్లింగ్ లో భారత దేశంలో అగ్రశ్రేణి సైక్లిస్ట్. త్వరలోనే ఢిల్లీలో జరగనున్న ఆసియా స్థాయి సైక్లింగ్ పోటీలకు సన్నద్ధమవుతోంది. సిసలైన ఆత్మవిశ్వాసం అంటే అదే కదూ..!

  • Loading...

More Telugu News