: పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస.. ఇద్దరి మృతి


పశ్చిమబెంగాల్ లో జరుగుతున్న రెండవ దశ పంచాయతీ ఎన్నికలు హింసాత్మక రూపుదాల్చాయి. నేడు సీపీఎం, తృణమూల్ (టీఎంసీ) కార్యకర్తల మధ్య జరిగిన గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు బాంబులతో దాడులు చేసుకోవడంతో బుర్ ద్వాన్ జిల్లా మధుడంగా గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రం వద్ద గందరగోళం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సీపీఎం పార్టీ అభ్యర్ధి మనోహ్ర బాబీ భర్త షేక్ హస్మత్ మరణించాడు. దాంతో, ఆగ్రహించిన గ్రామస్థులు దుండగుల్లో ఒకరిపై దాడిచేయడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఓటర్లు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా తగు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News