: ఢిల్లీలో చివరి టెలిగ్రామ్ రాహల్ గాంధీకే


టెలిగ్రామ్ శకం ముగిసింది. నిన్న రాత్రితో ఆ సదుపాయం కనుమరుగైంది. దేశ రాజధానిలో చివరి టెలిగ్రామ్.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీకి వెళ్లడం విశేషం. జనపథ్ లోని సెంట్రల్ టెలిగ్రామ్ ఆఫీసు నుంచి అశ్విని మిశ్రా దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ ఎస్ఎం ఖాన్ కు, అనంతరం రాహుల్ కు టెలిగ్రామ్ పంపించారు. ఈ విషయాన్ని సంబంధిత కేంద్రం సిబ్బంది వెల్లడించారు. టెలిగ్రాం సేవలు నిన్న రాత్రి 9 గంటలతో ముగిసిపోవాల్సి ఉండగా, స్పందన అధికంగా ఉండడంతో జనపథ్ లోని టెలిగ్రామ్ కార్యాలయం రాత్రి 11.45 గంటల వరకూ తెరిచే ఉంచారు.

  • Loading...

More Telugu News