: ఈ అయస్కాంతం చాలా శక్తిమంతం


అయస్కాంతం కొంత మేర శక్తిని కలిగి వుంటుంది. అయితే ఏకంగా రెండు లేదా మూడు రెట్ల అధిక ప్రోటాన్లను ఢీకొట్టించగల అయస్కాంతాన్ని శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇది అత్యంత భారీ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు నియోబియం టైటానియం అనే సూపర్‌ కండక్టర్‌ ద్వారా ఒక కొత్త అయస్కాంతాన్ని తయారు చేశారు. ఈ అయస్కాంతాన్ని భూగర్భ ప్రయోగశాల 'లార్జ్‌ హ్యాడ్రన్‌ కొలైడర్‌ (ఎల్‌హెచ్‌సీ)'లో అమర్చారు. ఈ అయస్కాంత శక్తికి సంబంధించి ఇటీవల జరిపిన పరీక్షల్లో ఇది విజయవంతంగా నిలిచింది. రెండు లేదా మూడు రెట్ల అధిక ప్రోటాన్లను ఢీకొట్టించగల శక్తిగల ఈ అయస్కాంతం ఇప్పుడున్న వాటికి ప్రత్యామ్నాయం కాగలదని, అంతేకాకుండా కొత్తగా కనుగొన్న హిగ్స్‌బోసాన్‌ పరమాణువుల లక్షణాల రహస్యాన్ని తేటతెల్లం చేయగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నియోబియం టైటానియం హిగ్స్‌బోసన్‌ను గుర్తించేందుకు సరైనదే కానీ, హిగ్స్‌బోసన్‌ లక్షణాలను నిర్దిష్టంగా తెలిపేందుకు ఎల్‌హెచ్‌సీలో మరికొన్ని చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు ఈ కొత్త అయస్కాంతం ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News