: పోరాడి ఓడిన కంగారూలు


ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ బోణీ చేసింది. తొలి టెస్టును 14 పరుగుల తేడాతో కైవసం చేసుకుంది. చివరి రోజు ఆటలో హైడ్రామా చోటు చేసుకోగా.. కొరకరానికొయ్యలా పరిణమించిన ఆసీస్ వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ (71)ను ఆండర్సన్ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ విజయం సాకారమైంది. పిచ్ స్వభావం మందకొడిగా మారినా పదునైన బంతులతో ఆసీస్ బ్యాట్స్ మెన్ కు పరీక్ష పెట్టిన ఆండర్సన్ కు 5 వికెట్లతోపాటు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' కూడా దక్కింది. ఆండర్సన్ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లోనూ ఐదు వికెట్లు తీయడం విశేషం. కాగా, ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు హడిన్.. ప్యాటిన్సన్ (25 నాటౌట్)తో కలిసి విఫలయత్నం చేశాడు. ఆఖరి వికెట్ కు ఈ జోడీ 65 పరుగులు జోడించింది. అయితే, ఆండర్సన్ ఈ జోడీని విడదీయడంతో ఆసీస్ 296 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ 5 టెస్టుల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. రెండో టెస్టు ఈ నెల 18న లార్డ్స్ వేదికగా ఆరంభం కానుంది.

ఈ మ్యాచ్ లో స్కోర్లు ఇలా ఉన్నాయి..

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 215

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 280

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 375

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్:296

  • Loading...

More Telugu News