: ధోనీపై లక్ష్మణ్ కామెంట్
మహేంద్ర సింగ్ ధోనీ లాంటి ఆటగాడు కెప్టెన్ గా ఉండడం టీమిండియా అదృష్టమని బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ గడ్డపై చాంపియన్స్ ట్రోఫీ, కరీబియన్ దీవుల్లో ముక్కోణపు సిరీస్ గెలిచి భారత్ కీర్తిపతాకను క్రికెట్ వినీలాకాశంలో సగర్వంగా ఎగరేసిన ధోనీపై లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ ఫంక్షన్ లో పాల్గొనేందుకు కోల్ కతా వచ్చిన ఈ మణికట్టు మాంత్రికుడు మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ధోనీ గురించి అతని రికార్డులు మాట్లాడతాయని కితాబిచ్చాడు. కఠిన పరిస్థితుల్లో సైతం సావధానంగా ఉండడం అతని ప్రత్యేకత అని చెబుతూ, ఉద్రేకానికి లోనుకాకపోవడం మరో సుగుణమని పేర్కొన్నాడు. కాగా, ధోనీ వైఖరితో మనస్తాపం చెందే లక్ష్మణ్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడని అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.